Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భగాయత్‌లో షెడ్ల నిర్మాణాల జోరు!

Author
Posted By DIKSOOCHI MEDIA
| 08 Oct 2026, 10:55 AM | TELANGANA
భగాయత్‌లో షెడ్ల నిర్మాణాల జోరు!

  • అనుమతులపై స్పష్టత కరవు.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు
  • ‘షెడ్డుకు ఓ రేటు’ అంటూ స్థానికుల ఆరోపణలు.. విచారణకు డిమాండ్

అనుమతులపై స్పష్టత కరవు.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు
‘షెడ్డుకు ఓ రేటు’ అంటూ స్థానికుల ఆరోపణలు.. విచారణకు డిమాండ్
ఉప్పల్, నేటి దిక్సూచి :
ఉప్పల్‌ భగాయత్‌ ప్రాంతంలో షెడ్ల నిర్మాణాలు వరుసగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల సంబంధిత అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిర్మాణ పనులు బహిరంగంగానే సాగుతున్నప్పటికీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జోనల్‌ కమిషనర్‌ దృష్టి సారిస్తారా?
భగాయత్‌ ప్రాంతంలో జరుగుతున్న షెడ్ల నిర్మాణాలపై జోనల్‌ కమిషనర్‌ రాధికా గుప్తా ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు, నిర్మాణ నిబంధనల అమలుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు అంటున్నారు. సమగ్రంగా తనిఖీలు నిర్వహిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు.
‘షెడ్డుకు ఓ రేటు’ అంటూ ఆరోపణలు
షెడ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో షెడ్డుకు ఒక్కో రేటు అంటూ స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత..? ఎవరి పాత్ర ఎంత..? అనే విషయాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అన్నది అధికారిక తనిఖీలతో తేల్చాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.
నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూస్తారా?

షెడ్‌ నిర్మాణం ఒకరోజులో పూర్తయ్యేది కాదు. ఇనుప కట్టడాలు, పైకప్పు, ఇతర నిర్మాణ పనులు దశలవారీగా కొనసాగుతాయి. ఈ సమయంలోనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను గుర్తించాల్సి ఉంటుంది. అయితే భగాయత్‌లో వరుసగా నిర్మాణాలు కొనసాగుతున్నా పర్యవేక్షణ కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నోటీసులు ఎన్ని? చర్యలు ఎన్నింటిపై?
భగాయత్‌లో షెడ్ల నిర్మాణాలపై ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు అందాయి..? అధికారులు ఎన్ని ప్రాంతాలను తనిఖీ చేశారు..? ఎన్ని నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు..? ఎన్ని నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు..? అనే వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు కోరుతున్నారు.

భగాయత్‌లో షెడ్ల నిర్మాణాల జోరు! - Additional Image