Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అక్టోబర్ 10 నుంచి బతుకమ్మ పండుగ: వేడుకల షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం

Author
Posted By DIKSOOCHI MEDIA
| 03 Oct 2026, 06:47 PM | Bhakti
అక్టోబర్ 10 నుంచి బతుకమ్మ పండుగ: వేడుకల షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ వేడుకల అధికారిక షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

వేడుకల్లో అత్యంత కీలకమైన 'సద్దుల బతుకమ్మ'ను అక్టోబర్ 18న నగరంలోని ట్యాంక్‌బండ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అమరవీరుల స్మారక స్తూపం నుంచి ప్రారంభమయ్యే వేలాది మంది మహిళల బతుకమ్మల భారీ ర్యాలీ ట్యాంక్‌బండ్‌‌ వరకు సాగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రధాన సంబరాలు కొనసాగుతాయి. రాత్రి వేళ బతుకమ్మ ఘాట్, నెక్లెస్ రోడ్డు వద్ద నిమజ్జన కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

నగర వ్యాప్తంగా అలరించే ప్రదర్శనలు
ఉత్సవాల సందర్భంగా రవీంద్రభారతి ప్రాంగణంలో 10 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లను బతుకమ్మ ఆకృతులు, రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లోనూ పండుగ వాతావరణం ఉట్టిపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సందర్శకులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు, బారికేడింగ్, వెలుతురు, మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఈ సారి బతుకమ్మ వేడుకల కోసం ప్రభుత్వం ప్రత్యేక లోగోను రూపొందించింది. బతుకమ్మ విశిష్టతతో పాటు త్వరలో జరగనున్న 'తెలంగాణ గ్లోబల్ సమ్మిట్' ప్రాముఖ్యత ప్రతిబింబించేలా ఈ లోగోను డిజైన్ చేశారు.