Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తొర్రూరులో రూ.54 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Author
Posted By DIKSOOCHI MEDIA
| 04 Oct 2026, 08:02 PM | Array
తొర్రూరులో రూ.54 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తుర్కయంజాల్/నేటి దిక్సూచి:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూరు డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
తొర్రూరు డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు పీఎం శ్రీ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మొత్తం రూ.54 లక్షలతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఎంఈఓ జగదీష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కొత్తకురుమ సత్తయ్య, తొర్రూరు డివిజన్ అధ్యక్షుడు కోశిక ఐలయ్య, తుర్కయంజాల్ డివిజన్ అధ్యక్షుడు ఓర్సు శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ హరిత ధన్రాజ్, సీనియర్ నాయకులు సామ భీంరెడ్డి, కాకుమాను సునీల్, బొక్క వంశీ రెడ్డి, గౌస్‌తో పాటు ఆయా కాలనీలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.