Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

షెడ్డు నిర్మాణం పూర్తి కావొస్తున్నా.. అధికారుల చర్యలేవీ?

Author
Posted By DIKSOOCHI MEDIA
| 05 Oct 2026, 07:45 AM | Array
షెడ్డు నిర్మాణం పూర్తి కావొస్తున్నా.. అధికారుల చర్యలేవీ?

నిర్మాణం పూర్తయ్యే దశలోనైనా పరిశీలిస్తారా?
తుర్కయంజాల్, నేటి దర్శిని :
ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్ వార్డులో భారీ షెడ్డు నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నా సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇనుప స్తంభాలు, రేకులతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగి ప్రస్తుతం తుది దశకు చేరుకున్నప్పటికీ, ఈ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతులు ఉన్నాయా? లేదా? అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పనులు పూర్తయ్యే వరకు అధికారుల నిరీక్షణ?
అనుమతులు అవసరమైన నిర్మాణమైతే పనులు ప్రారంభమైన సమయంలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు అంటున్నారు. అయితే నిర్మాణం దాదాపు పూర్తయ్యే వరకు ఎలాంటి తనిఖీలు లేకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.
నిర్మాణం పూర్తయిన తర్వాత అక్రమమని గుర్తించి చర్యలు తీసుకోవడం కంటే, ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, స్థల వినియోగం, నిర్మాణ నిబంధనల పాటింపు వంటి అంశాలను పరిశీలించడం అవసరమని స్థానికులు కోరుతున్నారు.
అనుమతులు ఉంటే వెల్లడించాలి.. లేకుంటే చర్యలు
షెడ్డు నిర్మాణానికి సంబంధిత అనుమతులు ఉన్నట్లయితే అధికారులు స్పష్టం చేయాలని, అనుమతులు లేకుండా నిర్మాణం కొనసాగుతున్నట్లయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన నిర్మాణ రుసుములు, పన్నులు తదితర అంశాలపైనా అధికారులు పరిశీలన చేయాలని కోరుతున్నారు.
డిప్యూటీ కమిషనర్ దృష్టి సారించేనా?
తుర్కయంజాల్‌లో భారీ షెడ్డు నిర్మాణంపై ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి టౌన్‌ప్లానింగ్ అధికారులతో క్షేత్రస్థాయి తనిఖీ చేయించాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మాణం పూర్తయ్యే దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి వాస్తవాలను తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
నిర్మాణం పూర్తయ్యే వరకు చూస్తారా.. లేక ఇప్పటికైనా నిబంధనలపై స్పష్టత ఇస్తారా? అనేది అధికారుల స్పందనతో తేలాల్సి ఉంది.

షెడ్డు నిర్మాణం పూర్తి కావొస్తున్నా.. అధికారుల చర్యలేవీ? - Additional Image