షెడ్డు నిర్మాణం పూర్తి కావొస్తున్నా.. అధికారుల చర్యలేవీ?

నిర్మాణం పూర్తయ్యే దశలోనైనా పరిశీలిస్తారా? తుర్కయంజాల్, నేటి దర్శిని : ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్ వార్డులో భారీ షెడ్డు నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నా సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇనుప స్తంభాలు, రేకులతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగి ప్రస్తుతం తుది దశకు చేరుకున్నప్పటికీ, ఈ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతులు ఉన్నాయా? లేదా? అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు పూర్తయ్యే వరకు అధికారుల నిరీక్షణ? అనుమతులు అవసరమైన నిర్మాణమైతే పనులు ప్రారంభమైన సమయంలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు అంటున్నారు. అయితే...