తొర్రూరులో రూ.54 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తుర్కయంజాల్/నేటి దిక్సూచి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూరు డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తొర్రూరు డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు పీఎం శ్రీ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మొత్తం రూ.54 లక్షలతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఎంఈఓ జగదీష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి...