హవ్వా.. జర్నలిస్టుల పేరుతో మద్యం బాటిళ్ల వసూళ్లా?
ముఖ్యమైన పాయింట్స్:మర్రిగూడలో ఎక్సైజ్ సిబ్బంది తీరుపై ఆరోపణలుమూడు వైన్ షాపుల నుంచి బాటిళ్లు సేకరించినట్లు ప్రచారం.. నిజానిజాలు తేల్చాలని డిమాండ్! మర్రిగూడలో ఎక్సైజ్ సిబ్బంది తీరుపై ఆరోపణలు మూడు వైన్ షాపుల నుంచి బాటిళ్లు సేకరించినట్లు ప్రచారం.. నిజానిజాలు తేల్చాలని డిమాండ్! మర్రిగూడ,నేటి దిక్సూచి: అక్రమాలను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ సిబ్బందిపైనే వసూళ్ల ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. దసరా పండుగ సందర్భంగా జర్నలిస్టులకు ఇవ్వాలంటూ మర్రిగూడ మండల కేంద్రంలోని మూడు వైన్ షాపుల యాజమాన్యాల నుంచి ఎక్సైజ్ అధికారులు మద్యం బాటిళ్లు సేకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది? ఎవరి ఆదేశాలతో బాటిళ్లు సేకరించారు? నిజంగానే పాత్రికేయుల పేరును ఉపయోగించుకున్నారా?...