కీసరలో ఏసీబీ పంజా.. రూ.2.50 లక్షల లంచం
ముఖ్యమైన పాయింట్స్:కేసులో డిప్యూటీ తహసీల్దార్!సందీప్ రెడ్డిని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులుతహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న తనిఖీలు.. ఇతరుల ప్రమేయంపై ఆరా కీసర, అక్టోబర్ 15 (నేటి దిక్సూచి ): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడులు కలకలం సృష్టించాయి. డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి రూ.2.50 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో రెవెన్యూ శాఖలో చర్చ మొదలైంది. కార్యాలయంలో అధికారుల తనిఖీలు లంచం వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు కీసర తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. సంబంధిత పత్రాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తూ కేసుకు సంబంధించిన...