అనుమతులు నాలుగు అంతస్తులకు.. నిర్మాణం ఆరు అంతస్తులకు!
ముఖ్యమైన పాయింట్స్:శాంతినగర్ ప్రధాన రహదారిపైనే నిబంధనలకు తూట్లు.. టౌన్‌ప్లానింగ్ అధికారుల మౌనం ఎందుకు?అనుమతులకు మించి నిర్మాణం జరుగుతున్నా చర్యలేవీ? ఉన్నతాధికారులు స్పందించేదెప్పుడు? శాంతినగర్ ప్రధాన రహదారిపైనే నిబంధనలకు తూట్లు.. టౌన్‌ప్లానింగ్ అధికారుల మౌనం ఎందుకు? అనుమతులకు మించి నిర్మాణం జరుగుతున్నా చర్యలేవీ? ఉన్నతాధికారులు స్పందించేదెప్పుడు? సికింద్రాబాద్ జోన్, నేటి ప్రభాత సూర్య ప్రతినిధి: నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే మౌనం వహిస్తున్నారా? అన్న ప్రశ్నలు మెట్టుగూడ సర్కిల్ పరిధిలోని శాంతినగర్ ప్రధాన రహదారిపై జరుగుతున్న భవన నిర్మాణాన్ని చూస్తే తలెత్తుతున్నాయి. నాలుగు అంతస్తులకు అనుమతులు తీసుకొని ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా, సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇప్పటివరకు...