ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా DMHO స్వర్ణకుమారి!
హైదరాబాద్, అక్టోబర్ 5 (నేటి దిక్సూచి): రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో Anti-Corruption Bureau (ACB) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ DMHO డాక్టర్ స్వర్ణకుమారి లంచం వ్యవహారంలో ఏసీబీ అధికారులకు చిక్కినట్లు సమాచారం. రూ.లక్ష లంచం వ్యవహారంలో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ Hospitalకు సంబంధించిన అనుమతులు, అధికారిక ప్రక్రియలో సహకరించేందుకు లంచం డిమాండ్ చేశారన్న ఫిర్యాదు ఏసీబీ అధికారులకు అందినట్లు సమాచారం. ఫిర్యాదును పరిశీలించిన ACB అధికారులు పక్కా ప్రణాళికతో Trap Operation నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రూ.లక్ష లంచం వ్యవహారంలో DMHO స్వర్ణకుమారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ...