కోర్టు ఆదేశాల మేరకే భూ రిజిస్ట్రేషన్
యాచారం, నేటి దిక్సూచి :కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశామని యాచారం తహసీల్దార్ అయ్యప్ప తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం అధికారుల బాధ్యత అని, ఈ విషయంలో రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోని భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ వ్యవహారంపై తహసీల్దార్ వివరణ ఇచ్చారు. సంబంధిత భూమిపై న్యాయస్థానంలో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిశీలించి, వాటి ప్రకారమే రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు.సంబంధిత భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు, గతంలో వెలువడిన న్యాయస్థానం ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అధికారులు తదుపరి చర్యలు చేపట్టారని వివరించారు....