భారత్ శాంతి ప్రతిపాదనపై ఉక్రెయిన్ కీలక ప్రకటన.. సీజ్ ఫైర్కు సిద్ధమే..
రష్యా-ఉక్రెయిన్ మధ్య నిరంతరం కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా భారత్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్ తీవ్రంగా యోచిస్తోంది. భారత్ పంపించిన సీజ్ ఫైర్ (కాల్పుల విరమణ) ప్రతిపాదన ఎంతో విస్తృతంగా, ఆచరణాత్మకంగా ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా వెల్లడించారు. కీవ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రతిపాదించిన సీజ్ ఫైర్ అంశంపై దృష్టి సారించేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందంటూ India Ukraine Ceasefire Proposal పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాలను 'యూరోపియన్ ప్రావ్దా' న్యూస్ పేపర్ కథనంలో ప్రచురించింది. యుద్ధ విరమణ కోసం భారత్తో పాటు టర్కీ, ఈజిప్ట్, అమెరికా దేశాల నుంచి తమకు...