పీహెచ్‌సీల పనితీరుపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ

నాలుగు ఆరోగ్య కేంద్రాల్లో సేవలు, సిబ్బంది హాజరుపై సమీక్ష రంగారెడ్డి : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల నిర్వహణ, సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. స్వర్ణకుమారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం ఆరుట్ల, మాడ్గుల, ఇర్విన్, యాచారం పీహెచ్‌సీలను సందర్శించిన ఆమె ఆయా కేంద్రాల్లో అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీహెచ్‌సీల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఓపీ–ఐపీ నమోదు వివరాలు, మందుల లభ్యత, శీతల గొలుసు నిర్వహణ, ప్రయోగశాల సేవలు, సిబ్బంది హాజరు తదితర అంశాలను డా. స్వర్ణకుమారి పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాల పారిశుధ్యంతో పాటు అసాంక్రమిక వ్యాధుల నియంత్రణ, క్షయ వ్యాధి సేవలు,...