ఓబీసీ హక్కుల కోసం ఐక్యంగా కదలాలి.. గొల్లపల్లిలో రేపు ‘ఓబీసీ సింహగర్జన’ మహాసభ.. భారీగా తరలిరావాలి: కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్
శంషాబాద్/: ఓబీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం నిర్వహించనున్న ‘ఓబీసీ సింహగర్జన’ మహాసభను విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన తగిన వాటా, రాజ్యాంగబద్ధమైన హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.ఆదివారం అక్టోబర్ 4న మధ్యాహ్నం 3 గంటలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లపల్లిలో పీసీసీ ఓబీసీ ఛైర్మన్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. “ఎవరి సంఖ్య ఎంతైతే.. అంత వాటా” అనే నినాదాన్ని సాకారం చేసే దిశగా ఓబీసీల హక్కులపై ఈ సభలో చర్చ...