సహారా బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి: బాధితుల డిమాండ్
మంచిర్యాల జిల్లా |ప్రతినిధి.అక్టోబర్ సెప్టెంబర్ 3 : సహారా ఇండియా సంస్థలో తమ జీవితకాల పొదుపులను డిపాజిట్ చేసి, కాలపరిమితి పూర్తయినా డబ్బులు తిరిగి అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సహారా బాధితులు డిమాండ్ చేశారు. రేపు కరీంనగర్ పర్యటనకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని కోరుతూ శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సహారా బాధితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సహారా బాధితుడు, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది సహారా డిపాజిటర్లు తమ కష్టార్జితాన్ని సంస్థలో పెట్టుబడిగా...