కోర్టు ఆదేశాల మేరకే భూ రిజిస్ట్రేషన్
యాచారం, నేటి దిక్సూచి :కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశామని యాచారం తహసీల్దార్ అయ్యప్ప తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం అధికారుల బాధ్యత అని, ఈ విషయంలో రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోని భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ వ్యవహారంపై తహసీల్దార్ వివరణ ఇచ్చారు. సంబంధిత భూమిపై న్యాయస్థానంలో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిశీలించి, వాటి ప్రకారమే రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు.సంబంధిత భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు, గతంలో వెలువడిన న్యాయస్థానం ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అధికారులు తదుపరి చర్యలు చేపట్టారని వివరించారు. చట్టపరమైన ప్రక్రియకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తహసీల్దార్ స్పష్టం చేశారు.
భూ రిజిస్ట్రేషన్పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత పత్రాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని, కోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాలను కూడా అమలు చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
అధికారులు తమకు ఉన్న అధికార పరిధిలోనే విధులు నిర్వహిస్తారని, కోర్టు ఆదేశాలను అమలు చేయడం ప్రభుత్వ అధికారుల బాధ్యత అని అయ్యప్ప పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసిన అధికారులపై కేసులు నమోదు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.కోర్టు ఆదేశాలను గౌరవించడం, వాటిని అమలు చేయడం మా బాధ్యత. భూ రిజిస్ట్రేషన్పై ఎవరికైనా అభ్యంతరాలుంటే న్యాయపరంగా పరిష్కరించుకోవాలి” అని తహసీల్దార్ అయ్యప్ప స్పష్టం చేశారు.