🏠 diksoochi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 October 2026, 10:02 pm Posted by : DIKSOOCHI MEDIA

భారత్ శాంతి ప్రతిపాదనపై ఉక్రెయిన్ కీలక ప్రకటన.. సీజ్ ఫైర్‌కు సిద్ధమే..

News Image
రష్యా-ఉక్రెయిన్ మధ్య నిరంతరం కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా భారత్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్ తీవ్రంగా యోచిస్తోంది. భారత్ పంపించిన సీజ్ ఫైర్ (కాల్పుల విరమణ) ప్రతిపాదన ఎంతో విస్తృతంగా, ఆచరణాత్మకంగా ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా వెల్లడించారు. కీవ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రతిపాదించిన సీజ్ ఫైర్ అంశంపై దృష్టి సారించేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందంటూ India Ukraine Ceasefire Proposal పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాలను 'యూరోపియన్ ప్రావ్‌దా' న్యూస్ పేపర్ కథనంలో ప్రచురించింది.

యుద్ధ విరమణ కోసం భారత్‌తో పాటు టర్కీ, ఈజిప్ట్, అమెరికా దేశాల నుంచి తమకు ప్రొపోజల్స్ వచ్చాయని సిబిహా వెల్లడించారు. అయితే, ఏ ఒప్పందమైనా కేవలం మిలిటరీ ఆపరేషన్స్‌ను కంట్రోల్ చేయడం మాత్రమే కాకుండా, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై జరిగే దాడులను కూడా పూర్తిగా ముగించేలా ఉండాలని స్పష్టం చేశారు. "బ్లాక్ సీ సీజ్ ఫైర్, ఎనర్జీ సీజ్ ఫైర్ కాంబినేషన్ ఉంటేనే ఉక్రెయిన్ సమ్మతిస్తుంది" అని తేల్చి చెప్పారు (Black Sea Ceasefire).

మోదీ వద్ద 'గుడ్ ఐడియాస్' ఉన్నాయన్న పుతిన్:
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఈ ప్రకటన చేయడానికి ఒక రోజు ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భారత్ పాత్రపై ప్రశంసలు కురిపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద అత్యుత్తమ ఆలోచనలు (Modi Russia Ukraine Peace Plan) ఉన్నాయని పుతిన్ పేర్కొన్నారు. వాల్దాయ్ ఇంటర్నేషనల్ డిస్కషన్ క్లబ్ వార్షిక సమావేశంలో రష్యా టాస్ (TASS) న్యూస్ ఏజెన్సీతో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ మధ్య జరిగిన ప్రతి భేటీలోనూ యుద్ధాన్ని నిలిపివేసి సంప్రదింపుల ద్వారా పరిష్కారం కనుగొనాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారని తెలిపారు. బ్రిక్స్ (BRICS) సమావేశాల సందర్భంలోనూ ఇరు నేతలు ఈ అంశంపై చర్చించారు. వివాద పరిష్కారానికి భారత్ చేస్తున్న చొరవను రష్యా స్వాగతిస్తుందని, భారత్ ప్రతిపాదనలతో ఏకీభవిస్తున్నామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా పునరుద్ఘాటించారు.
🏠 Home