పీహెచ్సీల పనితీరుపై డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ
నాలుగు ఆరోగ్య కేంద్రాల్లో సేవలు, సిబ్బంది హాజరుపై సమీక్ష
రంగారెడ్డి : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల నిర్వహణ, సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. స్వర్ణకుమారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం ఆరుట్ల, మాడ్గుల, ఇర్విన్, యాచారం పీహెచ్సీలను సందర్శించిన ఆమె ఆయా కేంద్రాల్లో అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పీహెచ్సీల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఓపీ–ఐపీ నమోదు వివరాలు, మందుల లభ్యత, శీతల గొలుసు నిర్వహణ, ప్రయోగశాల సేవలు, సిబ్బంది హాజరు తదితర అంశాలను డా. స్వర్ణకుమారి పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాల పారిశుధ్యంతో పాటు అసాంక్రమిక వ్యాధుల నియంత్రణ, క్షయ వ్యాధి సేవలు, చిన్నారుల టీకాల కార్యక్రమాల అమలు తీరును కూడా సమీక్షించారు.
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. పీహెచ్సీలకు వచ్చే ప్రతి రోగికి అవసరమైన వైద్యం, మందులు, పరీక్షలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలే ప్రధాన వైద్య సేవా కేంద్రాలని, వాటి ద్వారా నాణ్యమైన సేవలు అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్వో సూచించారు.
తనిఖీల సందర్భంగా సంబంధిత పీహెచ్సీల వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.