ఓబీసీ హక్కుల కోసం ఐక్యంగా కదలాలి.. గొల్లపల్లిలో రేపు ‘ఓబీసీ సింహగర్జన’ మహాసభ.. భారీగా తరలిరావాలి: కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్
శంషాబాద్/: ఓబీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం నిర్వహించనున్న ‘ఓబీసీ సింహగర్జన’ మహాసభను విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన తగిన వాటా, రాజ్యాంగబద్ధమైన హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.ఆదివారం అక్టోబర్ 4న మధ్యాహ్నం 3 గంటలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లపల్లిలో పీసీసీ ఓబీసీ ఛైర్మన్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. “ఎవరి సంఖ్య ఎంతైతే.. అంత వాటా” అనే నినాదాన్ని సాకారం చేసే దిశగా ఓబీసీల హక్కులపై ఈ సభలో చర్చ జరగనుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి AICC ఓబీసీ ఛైర్మన్ డా. అనిల్ జైహింద్ యాదవ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, AIPC చైర్మన్ మధు యాస్కీ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, AICC ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కోఆర్డినేటర్ కొప్పుల రాజు తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొంటారని వెల్లడించారు.
ఓబీసీ సోదరులు, యువత, మహిళలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ‘ఓబీసీ సింహగర్జన’ మహాసభను విజయవంతం చేయాలని మంగమ్మ శివకుమార్ కోరారు.